హయత్ నగర్ ,సెప్టెంబర్15(రాజధాని న్యూస్) :
హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..రాజీవ్ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని వస్తున్న హయత్ నగర్ డిపో కి చెందిన బస్సు మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో నాగోల్ నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కామెంట్లు